ఉచిత వైఫై 8 స్టేషన్లలో ...
- June 04, 2016
రైల్వే ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించేందుకు త్వరలో ఏడు రైల్వే స్టేషన్లులో వైఫై ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ సెర్చింజెన్ గూగుల్ సాయంతో అలహాబాద్, సెల్దాహ్తో పాటు ఏడు స్టేషన్లకు ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం రైల్వేశాఖ పదకొండు ప్రాంతాల్లో ఉచిత వైఫై సదుపాయాన్ని రైల్వే ప్రయాణికులకు కల్పిస్తోంది. ముంబయి సెంట్రల్, భువనేశ్వర్, కాచిగూడ, విజయవాడ, రాయ్‌పూర్, భోపాల్, పట్నా, రాంచీ, విశాఖపట్నం, జయపుర, గువాహటిలో ఈ సదుపాయం ఉంది. .
పూణె, ఎర్నాకులం, లఖ్‌నవూ, ఉజ్జయిని, గోరఖ్‌పూర్ స్టేషన్లులో త్వరలోనే ఉచిత వైఫై సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రయాణికులకు, సందర్శకులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు కల్పించేందుకు గూగుల్, రైల్‌టెల్, పీఎస్‌యూతో కలిసి రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది నాటికి దాదాపు 100 ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లులో ఉచిత వైఫై సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







