నీడపట్టున చేసే వ్యాయామాలకి ప్రాధాన్యం
- June 04, 2016
వేడి తగలకుండా వ్యాయామం..
వ్యాయామం వల్ల మేలెంతో చెప్పక్కర్లేదు. కానీ వేసవి వస్తే చాలామంది వ్యాయామం విషయంలో తటపటాయిస్తుంటారు. అధికవేడి వల్ల చెమట ఎక్కువగా బయటకుపోయి.. నీరసం రావడం, చిరాగ్గా అనిపించడం ఓ కారణం. ఆ సమస్య రాకుండా ఇలా చేయండి..
*
ఆరుబయట చేసే పరుగూ, వేగవంతమైన నడక కంటే నీడపట్టున చేసే వ్యాయామాలకి ప్రాధాన్యం ఇవ్వండి. తప్పనిసరైతే ఉదయం ఎనిమిదిలోపు, సాయంత్రం ఆరుతర్వాతే నడకవంటి వ్యాయమాలు చేయండి. అప్పుడే ఎండ వేడి నుంచి తప్పించుకోగలుగుతారు. ముఖచర్మం ఆరోగ్యం కోసం కచ్చితంగా సన్‌స్క్రీన్‌లోషన్ రాసుకోండి.
*
వ్యాయామం కోసం ఎంచుకునే దుస్తులు శరీరానికి తగిన గాలినందించేలా ఉండాలి.
చెమటని ఇట్టే పీల్చుకునేవై ఉండాలి. టీ షర్ట్‌లు, ట్యాంక్ టాప్‌లు, షార్ట్‌ల వంటివి చక్కగా సరిపోతాయి ఈ కాలానికి.
*
వ్యాయామం చేసేప్పుడు కచ్చితంగా నీళ్ల సీసా దగ్గర పెట్టుకోండి. అలసట అనిపించినప్పుడు గటగటా తాగేయకుండా కొద్దికొద్దిగా చప్పరించండి చాలు.
*
నీళ్లు మరీ అధికంగా తాగితే.. ఎక్కుసార్లు మూత్రం పోవడం వల్ల శరీరంలో సోడియం నిల్వలు తగ్గిపోతుంటాయి. కాబట్టి నీళ్లకి ప్రత్యామ్నాయంగా పళ్లరసాలు, కొబ్బరినీళ్లు, ఎలక్ట్రోలైట్ సాల్ట్ వంటివి తీసుకోండి. శరీరం తాజాగా ఉంటుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







