జక్కన్న సరదాగా దుబాయ్ లో
- June 04, 2016
జక్కన్న సరదాగా తనకు నచ్చిన అమ్మాయితో దుబాయ్ అంతా చుట్టేశాడు. అక్కడి వీధుల్లో తన అందాల రాశితో ఎంచక్కా డ్యూయెట్లు పాడేసుకున్నాడు. వీరిద్దరి ఆటాపాటల సందడేంటో తెలియాలంటే 'జక్కన్న' చూడాల్సిందే అంటున్నారు చిత్ర దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. సునీల్, మన్నార్ చోప్రా జంటగా ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్‌రెడ్డి నిర్మించిన చిత్రం 'జక్కన్న'. ఈ చిత్రం కోసం ఇటీవల దుబాయ్‌లో ఓ పాట చిత్రీకరించారు.ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ''ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఊహించని ట్విస్టులతో ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.
ఈ నెలలోనే పాటలను, జూలైలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: దినేశ్, సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్, సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







