దేశ ఆర్థిక రాజధాని ముంబైలో
- June 04, 2016
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముంబై-పుణె జాతీయ రహదారిపై ఓ లగ్జరీ బస్సు బీభత్సం సృష్టించింది. రెండు కార్లను ఢీ కొన్న బస్సు లోయలో పడింది.ఈ ప్రమాదంలో బస్సులోని 17 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు, కార్లు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. సుమారు 20 అడుగుల పై నుంచి బస్సు కిందకు పడింది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కల కారణాలతో పాటు ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







