బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ పొడిగింపు
- March 23, 2024
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో కవితను అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. వారం రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు, మరో మూడు రోజులు పొడిగించింది.
కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది, మరికొందరితో కలిపి కవితను ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు. కవిత కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు వెల్లడించలేదని చెప్పారు. కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని ఈడీ తెలిపింది. మద్యం కేసులో సమీర్ మహేంద్రును విచారించాల్సి ఉందన్న ఈడీ, మేకా శరణ్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







