మాస్కో ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోడీ
- March 23, 2024
న్యూఢిల్లీ: రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదుల నరమేధానికి పాల్పడ్డారు. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌లోకి ఆయుధాలతో ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 60 మందికి పైగా చనిపోగా, మరో 140 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) వేదికగా స్పందించారు. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావం తెలియజేశారు.
“మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మా ఆలోచనలు, ప్రార్థనలు వారితోనే ఉంటాయి. ఈ విపత్కర సమయంలో రష్యా ప్రభుత్వానికి, రష్యన్ ఫెడరేషన్ ప్రజలకు అండగా ఉంటాం” అని మోడీ ట్వీట్ చేశారు. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు