మాదక ద్రవ్యాల హబ్‌గా ఎపి రాష్ట్రం-ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల
- March 23, 2024
అమరావతి: ఆంధ్ర రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారని, డ్రగ్స్ రవాణా, వాడకంలో ఎపి నంబర్ 1 అనే ముద్ర వేశారని ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ పై శనివారం ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. ఎపిని ఉడ్తా ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని, దేశంలో ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా దాని మూలాలు ఏపిలోనే ఉంటున్నాయని పేర్కొన్నారు. 25వేల కేజీల మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే .. తమ తప్పు లేదంటూ బిజెపి, వైసిపి, టిడిపి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్రాల నిఘా వ్యవస్థల మద్దతు లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరతాయని ఆమె ప్రశ్నించారు. ‘డ్రగ్స్ మాఫియాతో మీకు సంబంధం లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? మీ అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపి సేఫ్ హెవెన్‌గా మారింది. తెర వెనుక ఎంతటి వాళ్లున్నా నిజాలు నిగ్గు తేల్చాలని సిబిఐని కోరుతున్నా. ఆసియాలోనే అతిపెద్ద డ్రగ్ డీల్‌గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR







