ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- March 29, 2024
దోహా: ఈద్ అల్ ఫితర్ సెలవుల్లో జనన మరియు మరణ ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించిన సమయాన్ని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కాలంలో నవజాత శిశువుల కోసం జనన ధృవీకరణ పత్రాల దరఖాస్తులు తాత్కాలికంగా వెబ్‌సైట్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొన్నది. నవజాత శిశు జనన ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తులు ఈద్ అల్ ఫితర్ సెలవుల సమయంలో మాత్రమే ఎలక్ట్రానిక్‌గా ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా స్వీకరించబడతాయని పేర్కొంది. అదే సమయంలో జనన ధృవీకరణ పత్రాలను ఉమెన్స్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని నవజాత శిశువు నమోదు కార్యాలయంలో ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సేకరించవచ్చు లేదా ఖతార్ పోస్ట్ ద్వారా డెలివరీ అవుతుంది. ఈద్ అల్ ఫితర్ సెలవుల్లో ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మానవతా సేవల కార్యాలయంలో మరణ ధృవీకరణ పత్రం జారీ సేవలు అందించబడతాయని పేర్కొంది. ఈద్ సెలవుల సమయంలో జనన మరియు మరణ కమిటీ తాత్కాలికంగా దరఖాస్తులను స్వీకరించదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







