గౌరీ పూజ

- April 11, 2024 , by Maagulf
గౌరీ పూజ

వివాహ బంధం నిలబడాలని ప్రార్థిస్తూ పెళ్ళిలో గౌరీ పూజ వివాహానికి ముందు కన్యలు గౌరీ పూజ చేస్తారు.ఈ ఆచారం ఇంచు మించు దేశమంతటా ఉంటుంది.పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. ఈ సంవత్సరం పండుగ గౌరీ పూజ ఏప్రిల్ 11, గురువారం నాడు చాలా వైభవంగా మరియు ఉత్సాహంతో ఆచరిస్తారు

 శ్రీ కృష్ణుడిని ప్రేమించి అతడినే వివాహం చేసుకోవడానికి రుక్మిణీదేవి కూడా గౌరీపూజ చేసింది. అసలు ఇలా చేయడానికి కారణం ఏమిటి అని ఆలోచించాలి. అంతే కాని, సింగినాదం జీలకర్ర అని కొట్టిపారేయడానికి వీలులేదు. మనకి పెద్దలు ఒక ఆచారం పెట్టారంటే దానికి సంబంధించి మన అభ్యున్నతి అంతా దాగి ఉంటుంది.

వివాహానికి ముందు అమ్మాయిలు ఆ తర్వాత వివాహానికి ముందు తర్వాత అడపిల్లల అనుభవం చూడండి.పెళ్ళంటే అమ్మాయిలకు అంతకు ముందు అసలు పరిచయం లేని ఒక కొత్త వ్యక్తితో బంధం ముడిపడి తన జీవితమంతా అతనితోనే సహవాసం చేయాలి.వివాహ జీవితంలో కలతలు రాకుండా వివాహ బంధాలు అనేవి మనకు స్వర్గంలో నిర్ణయమవుతాయని సామెత.

గౌరీ దేవిని గుర్తు చేసుకుంటే వివాహా జీవితంలో కలతలు,ఇబ్బందులు రావు. సంసారం స్వర్గతుల్యం అవుతుంది. వధూవరులు గౌరీ, విష్ణువు ప్రతీరూపంగా పెళ్ళికి ముందు ఆడపిల్లల చేత గౌరీపూజ చేయించడానికి కారణం అందుకే ఒక వైపు వధువు గౌరీ పూజ మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి.

శంకరభగవత్పాదుల వారు కూడా అమ్మవారికి సంబంధించిన సౌందర్యలహరి స్తోత్రం మొదలు పెట్టేటప్పుడు అమ్మవారి నామంతో కాకుండా ‘శివశ్శక్త్యాయుక్తో’ అంటూ అయ్యవారి నామంతో మొదలు పెట్టారు. అసలు ఈ గౌరీ పూజ చేయడానికి కారణం ఆడదాని యొక్క సౌభాగ్యాన్ని నిలిపే శక్తి ఆ పరాశక్తి అయిన సర్వమంగళా దేవతకే ఉంది.

ప్రతి కన్నెపిల్ల కూడా గౌరి పూజ చేసి కళ్యాణవేదిక మీదకి రావడానికి కారణం, అమ్మా! నువ్వు ఆదిశక్తివి కదా, నువ్వే నీ భర్త ఒక్కసారి కాళీ అన్నందుకు నీ రంగును మార్చుకున్నావే (అంటే భర్త హృదయంలో స్థానం సంపాదించడానికి), మరి నేను, మామూలు ఆడపిల్లని. నా ఇంటి పేరు వదిలేస్తున్నాను, గోత్రాన్ని వదిలేస్తున్నాను, తోబుట్టువులను వదిలేస్తున్నాను, పెరిగిన వాతావరణాన్ని వదిలేసి ఆయన చిటికిన వ్రేలు పట్టుకుని వెళుతున్నాను, నేను కూడా ఆయన మనసులో ఈ విషయంలో ఇది నాకు సరిపోదు అనుకోకుండా నన్ను అనుగ్రహించు తల్లీ…. అంటూ నిత్య సుమంగళిగా ఉండేటట్లుగా దీవించమంటూ గౌరి పూజ చేస్తుంది. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com