ఆస్కార్ 2025 : 97వ ఆస్కార్ అవార్డుల వేడుక డేట్ ఫిక్స్..
- April 12, 2024
ప్రపంచ సినీ పరిశ్రమలన్నీ కోసం కలకంటాయి. ప్రపంచంలోనే ప్రఖ్యాత సినీ అవార్డుల్లో టాప్ ఆస్కార్ అవార్డు. అది సాధించాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. మనకు కూడా రాజమౌళి, RRR వల్ల నాటు నాటు పాటకి 95వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో బెస్ట్ సాంగ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే మార్చ్ లో 96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. తాజాగా రాబోయే 97వ ఆస్కార్ అవార్డుల డేట్స్ అనౌన్స్ చేసింది అకాడమీ.
ఈ ఏడాది డిసెంబర్ 17న ఆస్కార్ కు సినిమాల షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. 2025 జనవరి 17న ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లో ఉన్న సినిమాలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 8తో ఓటింగ్ ముగుస్తుంది. 2025 మార్చ్ 2న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ అట్మాస్ థియేటర్‌లో 97వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరగనున్నట్టు అకాడమీ సంస్థ ప్రకటించింది. మరి ఈ సారి ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమాలు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంటాయో చూడాలి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







