కేన్సర్ చిన్నారులను కలిసిన అల్లు అర్జున్
- July 01, 2015
కేన్సర్ మహమ్మారి భారిన పడి బుతకు పోరాటం చేస్తున్న చిన్నారుల కోరిక తీర్చేందుకు అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. స్వచ్చంద సంస్థ చొరవతో చిన్నారుల కోరిక నెరవేర్చాడు. వారితో సరదాగా గడిపారు. తనను చూడాలని ఉందని కేన్సర్ బాధిత చిన్నారుల కోరికను స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ తీర్చారు. హైదరాబాద్ లోని ఎమ్‌ఎన్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు కేన్సర్ చిన్నారులను అల్లు అర్జున్ బుధవారం కలుసుకుని ముచ్చటించారు. గంట పాటు ఆ చిన్నారులు అల్లు అర్జున్ తో ఉల్లాసంగా గడిపారు. అనంతరం వారి యోగ క్షేమాలను వైద్యులతో పాటు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ ఈ సందర్భంగా ఆరుగురు చిన్నారులకు గిఫ్ట్ లు అందజేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.... చిన్నారుల కోసం తన సమయం కేటాయించడం పెద్ద విషయమేమీ కాదని, వారి ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలకు పిలిస్తే తప్పకుండా వెళతానని, తన చేతనైన సహాయం చేస్తానని అల్లు అర్జున్ తెలిపారు.
తాజా వార్తలు
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!







