నేషనల్ రియల్ ఎస్టేట్ డవలప్ మెంట్ కౌన్పిల్ (నారెడ్కో) అధ్యక్షునిగా సందీప్ మండవ

- April 15, 2024 , by Maagulf
నేషనల్ రియల్ ఎస్టేట్ డవలప్ మెంట్ కౌన్పిల్ (నారెడ్కో) అధ్యక్షునిగా సందీప్ మండవ

 ఉపాధ్యక్షునిగా రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా రమణ, కోశాధికారిగా కృష్ణ 

విజయవాడ : నేషనల్ రియల్ ఎస్టేట్ డవలప్ మెంట్ కౌన్పిల్ (నారెడ్కో) సెంట్రల్ జోన్ అధ్యక్షునిగా మాలక్ష్మి గ్రూపు సిఇఓ సందీప్ మండవ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. కేంద్ర ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వీయ నియంత్రణ కలిగిన సంస్ధగా స్దిరాస్తి రంగంలో నారెడ్కో సేవలు అందిస్తోంది. ఎన్.టి.ఆర్, కృష్ణా, ఏలూరు, భీమవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధికి సెంట్రల్ జోన్ నేతృత్వం వహిస్తోంది. వివిధ దశలలో జరిగిన చర్చల అనంతరం జరిగిన ఎన్నికల ప్రక్రియలో కార్యవర్గం మొత్తం ఏకగ్రీవం అయ్యిందని ఎన్నికల అధికారి కోనేరు రాజా తెలిపారు. గౌరవ ఛైర్మన్ గా గద్దె రాజలింగం వ్యవహరించనుండగా, కార్యనిర్వాహాక ఉపాధ్యక్షునిగా ఎం.రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా సాదినేని వెంకట రమణ, కోశాధికారిగా పోట్ల వెంకట కృష్ణ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎం. గణేష్ కుమార్, జి.హరిప్రసాద రెడ్డి, కార్యదర్శులుగా సిహెచ్ శరత్ కుమార్, పి.రాజకుమార్ వ్యవహరించనున్నారు. కార్య వర్గ సభ్యులుగా శ్రీనివాసరావు, శ్రీనివాస్ మెహర్, సురేష్, శ్రీనివాస్, కృష్ణ కిషోర్, వేణు మాధవ్, చైతన్య ఎన్నిక అయ్యారు.ఈ సందర్భంగా సందీప్ మండవ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో  నేషనల్ రియల్ ఎస్టేట్ డవలప్ మెంట్ కౌన్పిల్ (నారెడ్కో) పురోగతికి ప్రయత్నిస్తామన్నారు. సభ్యుల ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా సమర్ధవంతంగా ప్రాతినిధ్యం వహిస్తానన్నారు.రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కుంటున్న విభిన్న సమస్యలను అయా ప్రభుత్వ విభాగాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సందీప్ మండవ పేర్కోన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com