మండిపోతున్న ఎండలు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
- April 16, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలోనైతే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నేడు, రేపు అయితే ఎండలు మరింత మండిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సర్వీసులు తగ్గించాలని నిర్ణయించింది. మధ్యాహ్నం వేళ ప్రయాణికులు లేక బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో సర్వీసులు కుదిస్తున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. రేపటి నుంచి బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









