వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఘనంగా రంగస్థల దినోత్సవం

- April 17, 2024 , by Maagulf
వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఘనంగా రంగస్థల దినోత్సవం

హైదరాబాద్: హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ నిర్వహణలో తెలుగు రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రముఖ రంగస్థల టీ.వీ. సినీ నటుడు సుబ్బరాయ శర్మ కు నాటక రచయిత రంగస్థల ప్రముఖుడు తుర్ల పాటి రామచంద్ర రావు లను స్వర్ణ వంశీ యలవర్తి రాజేంద్ర ప్రసాద్ జాతీయ జీవన సాఫల్య పురస్కార ప్రదనోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోట శ్రీనివాస రావు పురస్కారాలు బహుకరించారు.కోటశ్రీనివాస రావు మాట్లాడుతూ...రంగస్థలం నుంచి సినీ నటుడుగా ఎదిగి వివిధ భాషల్లో 783 సినిమాలలో నటించి ప్రేక్షక ఆదరణ పొందానని అన్నారు.

సుబ్బరాయ శర్మ మాట్లాడుతూ... తన నటన పురోగతి కి పునాది వంటి వారని అయన తో పోటీ పడాలనీ కోరిక తినే ఈ స్థాయి కి వచ్చానన్నారు. రామ చంద్ర రావు గొప్ప నాటక ప్రయోక్త అని ప్రశంసించారు. రాజకీయ నాయకులు నుంచి సామాజిక కార్యకర్తలు వరకూ కుల మతాలు పోవాలని చెబుతారని కానీ మ్యారేజ్ బ్యూరోలన్ని కుల మత పరంగా ప్రచారంలో వుండగా సాధ్యం కాదని చెప్పారు. ఈ కార్యరంగానికి అధ్యక్షత వహించిన సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ...కళాకారులకు రిటైర్మెంట్ లేదన్నారు.యెలవర్తి రాజేంద్ర ప్రసాద్ వామ పక్ష భావాలు కాల్స్ మంచి కలాభిమానీ అని అయన పేరిట అవార్డు అందుకున్న వారికి అభినందన అన్నారు. సుబ్బ రాయ శర్మ మాట్లాడుతూ...వంశీ పురస్కారం ఆస్కార్ తో సమానం అన్నారు.రామ చంద్ర రావు మాట్లాడుతూ...సొంత డబ్బులు ఖర్చు చేసి నాటకాలు నాడు ఆడామని గుర్తు చేశారు.డాక్టర్ తెన్నేటి సుధ సన్మాన పత్ర రచన చెయగా వంశీ రామరాజు యలవర్తి ధనలక్ష్మి ప్రారంభ ప్రసంగం చేశారు.ఈ కార్యక్రమానికి తొలుత సుబ్బరాయ శర్మ దర్శకత్వంలో కంచెర్ల సూర్యప్రకాష్ రావు రచించిన 'కొత్త మలుపు' నాటిక ప్రదర్శించారు. సనాతన బ్రాహ్మణ కుటుంబాల్లో భర్త చనిపోయిన భార్య వితంతు తంతు కు వ్యతిరేకంగా ఎదురు తిరిగిన యువతి కథ కొత్త మలుపు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com