కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- April 19, 2024
కుప్పం: కుప్పం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. గురువారం రాత్రి కుప్పంకు చేరుకున్న ఆమె నేతలతో మాట్లాడారు. మా కుటుంబంతో కంటే మీతోనే చంద్రబాబు అత్యధిక సమయం గడిపారు..మీరు ఆయనతో దగ్గరగా ఉన్నారన్నారు. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయనకు ఓ టీమ్ అవసరం అని చెప్పారు. కుప్పం ప్రజలు ఇక్కడి పరిస్థితులు చక్కదిద్ది చంద్రబాబును గెలిపించడానికి కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు.
7సార్లు చంద్రబాబును వరుసగా కుప్పం ప్రజలు ఆశీర్వదించారని .ఈ విషయాన్ని మా కుటుంబం ఎప్పటికీ మరచిపోదు…అని అన్నారు . కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలుతెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. చంద్రబాబు కుప్పంలో ఏ ఒక్కరినీ మర్చిపోరు…అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తారని నా ప్రగాఢ విశ్వాసం. అని తెలిపారు. కుప్పంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేలా చంద్రబాబు చూస్తారని చెబుతూ, గత ఐదేళ్లుగా కుప్పం ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొన్నారుఅని అన్నారు. గతంలో ఎన్నడూ ఎదుర్కోని విధంగా సమస్యలు, .అక్రమ కేసులను భరించారని చెప్పారు. వైసీపీ దాష్టీకాలను తట్టుకుంటూ..ధీటుగా ఎదుర్కొంటూ పసుపు జెండాను నిలబెడుతూ వస్తున్న కుప్పం కుటుంబ సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు… అని భువనేశ్వరి అన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







