ఈ మొక్క కేవలం పూజకే కాదండోయ్ ఔషధాల గని కూడా.!

- April 19, 2024 , by Maagulf
ఈ మొక్క కేవలం పూజకే కాదండోయ్  ఔషధాల గని కూడా.!

బిళ్ల గన్నేరు లేదా సతత హరిత మొక్కగా పిలవబడే ఈ మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు హిందూ సమాజంలో బిళ్ల గన్నేరు లేదా సతత హరిత పువ్వులను పరమ శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు.

అందుకే శివాలయం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పూల మొక్కల్ని చూస్తుంటాం. అయితే, ఈజీగా కుండీల్లోనూ పెరిగే ఈ మొక్కల్ని ఇంటి పరిసర ప్రాంతాల్లోనూ పెంచుకుంటే మంచిదని చెబుతున్నారు.

కేవలం అందానికే కాదు, పూజ కోసమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్ ఈ మొక్కలతో. బీపీ, షుగర్ వున్నవాళ్లు బిళ్ల గన్నేరు ఆకుల్ని ప్రతీరోజూ తింటే బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో వుంటుందట. అలాగే బీపీ కూడా.

అంతేకాదు, స్కిన్ ఇన్‌ఫెక్షన్లు వున్న వారు ఈ ఆకుల రసాన్ని ఇన్‌ఫెక్షన్ వున్న చోట రాస్తే మంచి ఫలితం వుంటుందని అంటున్నారు.

మలేరియా, న్యూకోమియా వంటి వ్యాధుల నివారణ మందుల్లో వీటిని ఉపయోగిస్తారని ప్రూఫ్ వుంది. అలాగే క్యాన్సర్ గడ్డల్ని అడ్డుకునే శక్తి కూడా ఈ ఆకులకు వుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు సతత హరిత ఆకుల్నీ, పువ్వుల్నీ విరివిగా వినియోగిస్తుంటారు. ఇంకేం.! ఈ మొక్కను మనం కూడా ఇంట్లోనే పెరటిలోనే లేదంటే కుండీల్లోనో పెంచేసుకుంటే పోలా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com