ప్రియదర్శి - నభా నటేష్.! డార్లింగ్ కొత్తగా సరికొత్తగా.!
- April 19, 2024
కమెడియన్ ప్రియదర్శి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘మల్లేశం’ తదితర సినిమాలు సోలో హీరోగా చేసి సక్సెస్ అయ్యాడు ప్రియదర్శి.
హీరోగా తెరంగేట్రం చేసినప్పటికీ తనకి ఫేమ్ తీసుకొచ్చిన కమెడియన్ పాత్రలను మాత్రం వదులుకోవడం లేదీ యంగ్‌స్టర్. అదీ ఓ రకంగా మంచిదే అని చెప్పాలి.
గతంలో చాలా మంది కమెడియన్లు ఇలాగే హీరోలుగా మారి, కామెడీని వదిలిపెట్టేశారు. ఆ తర్వాత అటుకీ, ఇటుకీ కాకుండా కెరీర్‌లో వెనకబడిపోయారు. కానీ, ప్రియదర్శి మాత్రం అలా చేయకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకుంటున్నాడు.
అలాగే సోలోగానూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. హీరోగా ప్రియదర్శి చేస్తున్న సినిమాకి ‘డార్లింగ్’ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదో కొత్త రకం ప్రేమకథ అని తెలుస్తోంది. ఇంతవరకూ చాలా లవ్ స్టోరీస్ చూశాం. కానీ, ఈ సినిమాలోని లవ్ స్టోరీ న భూతో న భవిష్యతి అనేలా వుంటుందని అంటున్నారు.
ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఫీలవుతారని చెబుతున్నారు. అంతేకాదు, ఈ సినిమా ప్రమోషన్లు కూడా చాలా చాలా ఇన్నోవేటివ్‌గా ప్లాన్ చేస్తున్నారట.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







