ప్రైవేట్ స్కూళ్లలో ఆన్ లైన్ లెర్నింగ్ పొడిగింపు
- April 22, 2024
యూఏఈ: దుబాయ్, షార్జా ఎమిరేట్‌లోని ప్రైవేట్ పాఠశాలలకు దూరవిద్యా విధానాన్ని ఏప్రిల్ 22 వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 16న భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు ఆన్ లైన్ లెర్నింగ్ ను అమలు చేస్తున్నాయి. ఈమేరకు దుబాయ్ యొక్క నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) కీలక ప్రకటన చేసింది. పునర్ ప్రారంభించే ముందు స్కూల్స్ యాజమాన్యాలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడంతో దుబాయ్‌లోని అనేక పరిసరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు రహదారులు, ఇళ్లు వరద నీటిలోనే ఉన్నాయి. పబ్లిక్ రవాణా, మెట్రో సేవలపై ప్రభావం కొనసాగుతోంది.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







