కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- April 23, 2024
కొండగట్టు: హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. మాల విరమణ కోసం భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ రామ జయరామ జయ జయ రామ నామ స్మరణతో మార్మోగుతోంది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఉదయాన్నే కోనేటిలో స్నానం ఆచరిస్తున్నారు. వేకువజాము నుంచే ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీక్షాపరులు స్వామి వారి సన్నిధిలో దీక్షా విరమణ చేస్తున్నారు. అర్థరాత్రి నుంచి సుమారు 50 వేల మంది దీక్షాపరులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. 22న ప్రారంభమైన ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హనుమాన్ జయంతి అంటే హనుమంతుడి పుట్టినరోజు. హిందూ మతంలో హనుమాన్ జయంతికి చాలా విశిష్టమైన స్థానం ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతి ఏప్రిల్ 23 తెల్లవారుజామున 3 గంటల 25నిమిషాలకు ప్రారంభమై, ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 5 గంటల 18నిమిషాలకు ముగుస్తుంది. హనుమాన్ జయంతి రోజు ఎవరైతే హనుమంతుడిని విశేషంగా పూజిస్తారో వారికి శుభాలు జరుగుతాయని, ఆరోగ్యం ఉంటుందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







