ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- April 24, 2024
హైదరాబాద్: ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని సాట్ చైర్మన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నదని ఆయన అన్నారు.
అక్షర స్కూల్ యాజమాన్యం టికెట్లకు అక్రమంగా అమ్మకాలు చేస్తుందని ఆరోపించారు. క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర నిరాశలకు గురి చేసిందన్నారు.
హెచ్సీఏ వైఖరి నిరసిస్తూ గురువారం (ఏప్రిల్ 25) ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ముట్టడిస్తామని శివసేనా రెడ్డి పిలుపునిచ్చారు. సాట్ చైర్మన్ పిలుపు మేరకు రేపు ఉదయం 10 గంటలకు ఉప్పల్ స్టేడియంను యూత్ కాంగ్రెస్ ముట్టడించనుంది.
ఉదయం 10 గంటలకు శివసేన రెడ్డి ఉప్పల్ స్టేడియం చేరుకోనున్నారు. కాంగ్రెస్ అభిమానులతో పాటు యూత్ కాంగ్రెస్ భారీగా ఉప్పల్ స్టేడియం వద్దకు తరలిరావాలని శివసేనరెడ్డి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!







