తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- April 25, 2024
హైదరాబాద్: తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. మరో వారం రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదు అవుతాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
పలు జిల్లాలకు వడగాలుల ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్ నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాల, వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదారాబాద్ వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పగటి పూట ఉష్ణోగ్రతలో అనూహ్య మార్పులు వచ్చాయన్నారు. గరిష్టంగా సాధారణంగా కన్నా మూడు డిగ్రీలకు పైగా పెరిగాయని చెప్పారు. ఈనెల చివరి వారంలో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు