ఫరియా అబ్ధుల్లా.! కాబోయే భర్త విషయంలో ‘జాతి రత్నమే’.!
- April 27, 2024
ప్రతీ ఆడపిల్లా తనకు కాబోయే భర్త ఇలా వుండాలి.. అలా వుండాలి.. అంటూ కలలు కనడం సహజమే. అయితే, ‘జాతి రత్నాలు’ భామ ఫరియా అబ్ఢుల్లా తనకు కాబోయే భర్త కోసం ఏం చెప్పిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఇంతకీ ఫరియా అబ్ధుల్లా ఏం చెప్పిందట.! ఫరియా అబ్ధుల్లా హైట్ గురించి తెలిసిందే. దాదాపు ఆరడుగుల ఆజానుబాహురాలీ ముద్దుగుమ్మ. సో సహజంగా మన ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారం అమ్మాయి హైట్ కన్నా ఒక ఇంచైనా హైటుండాలనుకుంటారు ఆమెకు కాబోయే భర్త (ఈ మధ్య ఆ రూల్సేం లేవనుకోండి).
ఆరడుగుల ఆజానుబాహులు దొరకడమే కష్టం అనుకుంటే.. అంతకు మించి హైట్.. అంటే కాస్త కష్టమే. అయితే, ఫరియా అబ్ధుల్లా మాత్రం హైట్ తనకు పెద్దగా ప్రాబ్లమ్ కాదంటోంది.
కానీ, తన జీవితంలో ఎప్పుడూ తనను నవ్వుతూ నవ్విస్తూ ఫన్‌గా చూసుకునేవాడే తనకు భర్తగా కావాలంటోంది. అమ్మడు ప్రస్తుతం ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్నాడు. వచ్చే శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కంప్లీట్ ఫన్ టోన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫరియా ఈ వ్యాఖ్యలు చేసింది. సో, ఇది కూడా తన సినిమా ప్రమోషన్లలో భాగంగా చేసిన డిఫరెంట్ పబ్లిసిటీ స్టంటే అనుకోవాలా.? లేదంటే నిజంగానే ఫరియా అలా కోరుకుంటోందా.? లెట్స్ వెయిట్.!
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు