శ్రీలీల జాగ్రత్త పడిందా.?
- May 02, 2024
‘ధమాకా’ సినిమా హిట్ అవ్వడంతో ఏకంగా స్టార్ హీరోలతో వరుస ఆఫర్లు కొల్లగొట్టేసి స్టార్ హీరోయిన్ ఛెయిర్‌ని సింపుల్‌గా వేగంగా ఎక్కేసింది అందాల భామ శ్రీలీల. అయితే, వస్తున్నాయ్ కదా.. క్రేజ్ వుంది కదా.. అని దొరికిన ప్రథీ ఛాన్స్ అంది పుచ్చేసుకోవడంతో శ్రీలీల బొక్క బోర్లా పడింది.
ఎంత ఫాస్ట్‌గా పేరు తెచ్చుకుందో అంతే ఫాస్ట్‌గా నెగిటివిటీనీ మూట కట్టసుకుంది. అమ్మడి సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పుడు కాస్త స్లో అయ్యింది.
ఇంతవరకూ ఒప్పుకున్న ప్రాజెక్టులు దాదాపు పూర్తి చేసేసింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రమే వుంది. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సి వుంది కానీ, ఆ సినిమా విషయంలో తెర వెనుక చర్చలు ఇంకా ఫైనల్ కాలేదు.
దాంతో, శ్రీలీల కాస్త వెనుకడుగు వేసిందట. ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటోందట. ఈ సారి మంచి పర్ఫామెన్స వున్న ఛాలెంజింగ్ రోల్ అయితేనే సైన్ చేయాలని అనుకుంటోందట. మార్పు మంచిదే. మంచి పర్ఫామెన్స్ పడాలంటే కాస్త ఆచి తూచి అడుగులు వేయాల్సిందే. అన్నట్లు కోలీవుడ్ నుంచీ శ్రీలీలకు ఓ ఛాన్స్ వచ్చిందని సమాచారం. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







