రైట్ టైమ్‌లో ‘హరి హర వీరమల్లు’ టీజర్.!
- May 02, 2024
ఓ పక్క సమ్మర్ హీట్, మరోపక్క ఎలక్షన్స్ హీట్. ఈ టైమ్‌లో పవన్ కళ్యాణ్ నుంచి ఓ హాట్ అప్టేట్. అదే ‘హరి హరవీరమల్లు’ టీజర్. గతంలో గ్లింప్స్ రిలీజ్ చేశారు. యోధుడిలా పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాట ఘట్టాన్ని శాంపిల్‌గా ఆ గ్లింప్స్‌లో చూపించారు.
ఇప్పుడు అంతకు మించి అనేలా పవన్ కళ్యాణ్ పాత్రను ఎలివేట్ చేశారు. దొరలు పేదోళ్లని దోచుకుంటే, ఆ దొరల్ని నవాబులు దోచుకుంటారు. ఆ నవాబుల్ని ఢిల్లీలో వుండే చక్రవర్తులు దోచుకుంటారు.. అయితే, ఈ దొంగ నవాబుల బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి భగవంతుడు ఒకడ్ని పంపిస్తాడు.. అంటూ బ్యాక్ గ్రౌండ్లో పవర్ ఫుల్ వాయిస్‌తో స్టార్ట్ అయిన టీజర్.
అప్పుడే యోధుడిగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ. బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్. జస్ట్ టీజర్లోనే ఇంత చూపించారు. ఇక ట్రైలర్.. సినిమా ఎలా వుండబోతుందో.. అంటూ ఆసక్తి అమాంతం పెరిగిపోయింది.
ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మొగల్ చక్రవర్తిగా బాబీ డియోల్ క్రూరమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయనకు సరిసాటి అయిన వీరుడిగా పవన్ కళ్యాణ్ పాత్ర వుడబోతోంది.
ఈ సినిమాని పూర్తి చేసే బాధ్యతను నిర్మాత ఎ.ఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తీసుకోగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ వుండబోతోందని టీజర్ ద్వారా ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు