ట్రెండింగ్ అవుతోన్న తెలుగమ్మాయ్.!

- May 02, 2024 , by Maagulf
ట్రెండింగ్ అవుతోన్న తెలుగమ్మాయ్.!

కామాక్షి భాస్కర్ల..! ఎవరీ పదహారణాల తెలుగు పేరున్న ముద్దుగుమ్మ అనుకుంటున్నారా.! అవునండీ అచ్చంగా పదహారణాల తెలుగమ్మాయే. ‘పొలిమేర 2’ సినిమాతో పాపులర్ అయ్యింది.

పాపులర్ అవ్వడమే కాదండోయ్.. ఈ సినిమాలో అమ్మడి నటనకు గాను తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా దక్కించుకుంది. సత్యం రాజేష్ హీరోగా రూపొందిన చిత్రం ‘పొలిమేర’. మొదటి పార్ట్, రెండు పార్టులుగా ఈ సినిమాని రిలీజ్ చేశారు.

రెండింట్లోనూ కామాక్షి భాస్కర్ల హీరోయిన్ రోల్ పోషించింది. సెకండ్ పార్ట్‌లో అమ్మడి బోల్డ్ నటనకుగాను ఈ అవార్డు దక్కించుకుంది. క్లైమాక్స్‌లో కామాక్షి నటన అద్భుతహ అని ప్రముఖుల నుంచి పలు ప్రశంసలు దక్కాయ్. దాంతో, అమ్మడి పేరు తెగ ట్రెండింగ్ అవుతోంది.

ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ పోషించింది కానీ, పాపలో మంచి హాట్‌నెస్ దాగుంది. కామాక్షి సోషల్ మీడియా హ్యాండిల్ టచ్ చేస్తే ఆ విషయం విదితమవుతుంది. తొలి సినిమాకే డీ గ్లామర్ రోల్‌లో ఆ స్థాయి పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్న కామాక్షి భాస్కర్ల ఛాన్స్ దక్కాలే కానీ, ఎలాంటి రోల్ ఇచ్చినా సింపుల్‌గా హ్యాండిల్ చేసేయగలదు. చూడాలి మరి, ఫ్యూచర్‌ ప్రాజెక్టుల్లో కామాక్షి పర్‌ఫామెన్స్ ఎలా వుండబోతోందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com