ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- May 08, 2024
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థకు చెందిన సీనియర్ సిబ్బంది సామూహికంగా సిక్ లీవ్ తీసుకున్నారు. దీంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సుమారు 70 విమానాలను రద్దు చేశారు. దీంట్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు కూడా ఉన్నాయి. క్యాబిన్ సిబ్బందికి చెందిన కొంత మంది ఉద్యోగులు చివరి నిమిషంలో సిక్ లీవ్ తీసుకున్నారని, గత రాత్రి నుంచి విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఎందుకు ఉద్యోగులు ఒకేసారి సిక్ లీవ్‌లో వెళ్లారో తెలియడం లేదని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతినిధి వెల్లడించారు. విమానల రద్దు వల్ల ఇబ్బందులు పడ్డవారికి రిఫండ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. లేదంటే జర్నీ రీషెడ్యూల్ చేయడం జరుగుతుందని ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







