తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- May 10, 2024
హైదరాబాద్: తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 2024-2025 విద్యా సంవత్సరం కోసం అడ్మిషన్లు కల్పించనున్నారు. పదో తరగతి అర్హత పొందిన అభ్యర్థులు ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేటి నుంచి ప్రవేశాల కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 31.
ముఖ్యమైన వివరాలు:
తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం ప్రవేశాలు కల్పించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ లలో అడ్మిషన్లు పొందవచ్చు.
పదో తరగతిలో అర్హత సాధించిన విద్యార్థులు మోడల్ స్కూళ్లలో ఇంటర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ:మే 10, 2024
దరఖాస్తులకు చివరి తేదీ: మే 31, 2024
ఎంపిక విధానం: పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా తుది జాబితా విడుదల చేస్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!