ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- May 10, 2024
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దాదాపు 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. కాగా, శుక్ర, శని, ఆదివారాల్లో నడిచే 450 బస్సుల్లో రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
సొంత ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులు పల్లె బాట పడుతున్నారు. వరుస సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్ లో ఉండే వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల వారు ఓటేసేందుకు ఎలక్షన్ జర్నీకి సిద్ధం అయ్యారు. మే 13న పోలింగ్ ఉండగా.. 11న రెండో శనివారం, 12న ఆదివారం సెలవు ఉండటంతో ముందుగానే సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా శుక్రవారం (10వ తేదీ) నుంచే ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తరలివెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీంతో పండుగల సీజన్ లాగే ప్రయాణికుల కోసం స్పెషల్ సర్వీసులు సిద్ధం చేసింది ఆర్టీసీ. అలాగే, దక్షిణ మధ్య రైల్వే కూడా ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
గతంతో పోల్చుకుంటే ఈసారి ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, జిల్లాలో ఉండే వారు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లే అవకాశం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సాధారణంగా పండుగల సీజన్ లో నడిపే సర్వీసుల మాదిరిగా ఎలక్షన్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు, బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







