ఈ ఒక్క ఫేస్ ప్యాక్ చాలు ముఖం కాంతివంతగా మెరిసిపోవాలంటే.!
- May 17, 2024
ముఖం కాంతివంతంగా వుంచుకునేందుకు మార్కెట్లో లభించే బోలెడన్ని క్రీములు ఎవరికి తోచింది వాళ్లు విరివిగా వాడేస్తుంటాం. కానీ, ఆయా క్రీములు ఆయా సందర్భాల్లో కొన్ని రకాల స్కిన్స్‌కి హాని తలపెట్టవచ్చు.
అందుకే ముఖం విషయంలో అస్సలు రిస్క్ చేయకూడదు. అప్పుడప్పుడూ మీ ముఖ కాంతిని కాపాడుకునేందుకు సాధారణమైన సహజసిద్ధమైన ఇంటి చిట్కాలు వాడుతుండాలి.
అలాంటి వాటిలో చాలా సింపుల్‌గా చెప్పుకోదగ్గవి అలోవెరా. అలోవెరా చర్మ సౌందర్యానికి చాలా మేలు చేస్తుంది. చర్మంపై వుండే మృత కణాల్ని తొలగించి జిడ్డు చర్మం సమస్యను తొలగించడానికి కూడా సహాజయపడుతుంది.
రోజూ పడుకునే ముందు ముఖానికి కాసింత అలోవెరా జెల్‌ని పూతలా పూసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. కాసేపయ్యాకా కడిగేసినా ఫర్వాలేదు. లేదంటే రాత్రంతా అలాగే వుంచేసినా ఎలాంటి సమస్యా వుండదు. రాత్రంతా అది మీ ముఖానికి హైడ్రేషన్‌లా పని చేస్తుంది. తెల్లారేసరికి ముఖం కాంతివంతంగా మారుతుంది.
మొటిమల సమస్య వున్నవారికి అలోవెరా మంచి ఔషధం. అలాగే, పెరుగులోని లాక్టిక్ యాసిడ్ సహజ మాయిశ్చరైజర్‌లా పని చేసి, డెడ్ స్కిన్‌ని తొలిగించేందుకు తోడ్పడుతుంది. దుమ్ము, ధూళి ఎక్కువ సూర్య రశ్మి కారణంగా నల్లగా మారిన ముఖాన్ని తెల్లగా మార్చడంలో పెరుగు యూజ్ అవుతుంది. పెరుగులో కాస్త రోజ్ వాటర్ మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసి ఓ అరగంట తర్వాత కడిగేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
తాజా వార్తలు
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!







