ట్రాఫిక్ సేఫ్టీ కాంపిటీషన్ మెయిన్ ప్యానెల్ సమావేశం
- June 09, 2016
ఈ ఏడాదికి సంబంధించి ట్రాఫిక్ సేఫ్టీ కంపిటీషన్ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు కస్టమ్స్ ఫర్ ఆపరేషన్స్ మేజర్ జనరల్ హమాద్ బిన్ సులైమాన్ అల్ హత్మి నాయకత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ట్రాఫిక్ సేఫ్టీ అవార్డుల కోసం నామినేట్ చేయబడ్డ పలు ప్రాజెక్టుల గురించి సుదీర్ఘమైన చర్చ జరిగిందని అధికారులు తెలిపారు. 2017 ట్రాఫిక్ కాంపిటీషన్ - మీడియా ప్లాన్ గురించి కూడా చర్చించారు. ట్రాఫిక్ ప్రమాదాల్ని నివారించడం ప్రధాన ఎజెండాగా పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో ప్రసంగించారు. ప్రైవేటు సంస్థలు, అలాగే ఎన్జిఓలు కూడా ట్రాఫిక్ సేఫ్టీపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలనీ, వాటికి తగినంత సహాయం ప్రభుత్వం అందజేస్తుందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







