ఇండియా టైకూన్‌ని విడుదల చేసిన ఒమన్‌

- June 09, 2016 , by Maagulf
ఇండియా టైకూన్‌ని విడుదల చేసిన ఒమన్‌

గల్ఫార్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కాంట్రాక్టింగ్‌ ఎస్‌ఎఓజి వ్యవస్థాపకుడు మొహమ్మద్‌ అలీ, రమదాన్‌ తొలి రోజున విడుదలయ్యారు. రాయల్‌ పార్డన్‌లో భాగంగా మహమ్మద్‌ అలీని విడుదల చేసినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. 2014లో మస్కట్‌ క్రిమినల్‌ కోర్ట్‌ మహమ్మద్‌ అలీకి మూడు నెలల జైలు శిక్ష అలాగే 1.7 మిలియన్‌ ఒమన్‌ రియాల్‌ జరీమానా విధించింది. ఐదు గ్రాఫ్ట్‌ కేసులో ఈ శిక్ష పడింది ఆయనకు. శిక్ష పడ్డ తర్వాత అలీ, తన పదవికి రాజీనామా చేశారు. పెట్రోలియం డెవలప్‌మెంట్‌ ఒమన్‌ అధికారులను ప్రలోభపెట్టాడన్న అభియోగాల్ని ప్రాసిక్యూషన్‌ నిరూపించింది. 1972లో ఒమని షేక్‌తో కలిసి అలీ గల్ఫార్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కాంట్రాక్టింగ్‌ ఎస్‌ఓజిని స్థాపించారు. చిన్న సంస్థగా ప్రారంభమై, అనతి కాలంలోనే అతి పెద్ద సంస్థగా విస్తరించింది గల్ఫార్‌. అలి ఒమన్‌ ప్రభుత్వం నుంచి 'సివిల్‌ ఆర్డర్‌ గ్రేడ్‌ త్రీ'ని కూడా పొందారు. దేశ ఆర్తికాభివృద్ధికి తోడ్పాడునందించారని అప్పట్లో ఆయన్ని కొనియాడారు. అలాగే గల్ఫార్‌ ఒమన్‌లోని సింగిల్‌ లార్జెస్ట్‌ ప్రైవేట్‌ సెక్టార్‌ ఎంప్లాయర్‌గానూ, అలాగే అలీ ఒమన్‌లో రిచ్చెస్ట్‌ ఇండియన్‌గానూ పేరొందారు. అయితే, ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అలీ, కాంట్రాక్టుల కోసం అధికారులకు లంచమివ్వడం ద్వారా చెడ్డపేరు మూటగట్టుకున్నాడు. అలీతోపాటు 20 మంది ఒమన్‌ ఆయిల్‌ ఇండస్ట్రీకి చెందిన ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు ఎగ్జిక్యూటివ్‌లు జైలుకు వెళ్ళవలసి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com