హెల్తీ లివింగ్‌ రమదాన్‌ వెబ్సైటు ప్రారంభం

- June 09, 2016 , by Maagulf
హెల్తీ లివింగ్‌ రమదాన్‌ వెబ్సైటు ప్రారంభం

మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ - సుప్రీం కమిటీ ఫర్‌ హెల్త్‌ కేర్‌ కమ్యూనికేషన్స్‌ రమదాన్‌ సందర్భంగా ఖతార్‌ ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకోసం సహకరించేలా ఓ వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌లో, రమదాన్‌ సందర్భంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనే దానిపై అవసరమైన సమగ్ర సమాచారాన్ని పొందుపర్చుతారు. డయాబెటిక్‌ పేషెంట్స్‌, ఉపవాసం సందర్భంగా ఎలా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి? అనే అంశాల్ని ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలతో బాధపడ్తున్నవారికి ఈ వెబ్‌సైట్‌లో తగిన సమాచారం అందుబాటులో ఉంటుంది. రమదాన్‌ సందర్భంగా ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందనీ, తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఓ వైపు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఇంకో వైపు పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు చేయవచ్చని అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటివాటి ద్వారా కూడా ప్రజలకు ఈ విషయమై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com