మే 24-జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- May 21, 2024
రియాద్: మే 24 - జూన్ 26 మధ్య హజ్ పర్మిట్ లేని వారికి ఉమ్రా అనుమతులు జారీ చేయబడవని హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచం నలుమూలల నుండి సౌదీ అరేబియాకు తరలి రావడం ప్రారంభించిన హజ్ యాత్రికులు మక్కాలోని గ్రాండ్ మసీదులో తమ ఆచారాలను సౌకర్యంగా నిర్వహించడానికి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సౌదీ పౌరులు, ప్రవాసులు మరియు హజ్ అనుమతి లేకుండా మక్కాలోకి ప్రవేశించేటప్పుడు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై SR 10,000 జరిమానా విధించడం ప్రారంభిస్తామని అంతర్గత మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. పవిత్రమైన మక్కా నగరం, సెంట్రల్ హరామ్ ప్రాంతం, పవిత్ర స్థలాలైన మినా, అరాఫత్ మరియు ముజ్దలిఫా, రుసైఫాలోని హరమైన్ రైలు స్టేషన్లో హజ్ అనుమతి లేకుండా పట్టుబడిన వారిపై జరిమానాలు విధించబడతాయని హెచ్చరించింది. మళ్ళీ ఉల్లంఘించిన వారిపై జరిమానాను రెట్టింపు చేస్తామని, ఉల్లంఘన పునరావృతమైతే SR100,000 వరకు ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్







