మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ

- May 21, 2024 , by Maagulf
మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ

మస్కట్ : హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్   ఆదేశాల మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MOH)..చక్కెర స్థాయిలను మరియు ఇన్సులిన్ పంపులను కొలవడానికి ఎలక్ట్రానిక్ సెన్సార్లను పంపిణీ చేయడం ప్రారంభించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. టైప్ 1 డయాబెటిస్ ఉన్న ఒమానీ పిల్లలకు చక్కెర స్థాయిలను మరియు ఇన్సులిన్ పంపులను కొలవడానికి ఎలక్ట్రానిక్ సెన్సార్‌లను పంపిణీ చేయడం ప్రారంభించారు. తాజా అధునాతన సాంకేతికతలు  ఉన్న ఈ సెన్సార్లు, రక్తంలో చక్కెర వ్యాధుల ఫలితంగా వచ్చే లక్షణాలను తగ్గించడానికి దోహదపడే ఖచ్చితమైన డేటాను పొందవచ్చు. టైప్ 1 డయాబెటీస్‌కు ఎటువంటి నివారణ లేదు. అయితే అధునాతన వైద్య పద్ధతులు,  జీవన నాణ్యతను మెరుగుపరిచే ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి దాని తీవ్రమైన సమస్యలను తగ్గించి పిల్లలలో దీనిని నియంత్రించవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com