శర్వా సినిమా తొలి షెడ్యూలు షూటింగ్ పూర్తి..
- June 10, 2016
గమ్యం, రన్ రాజా రన్ లాంటి సినిమాలలో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్.. ఈసారి ఓ పోలీసు పాత్ర పోషిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి బ్రేక్ సాధించిన లావణ్య త్రిపాఠీ అతడి సరసన నటిస్తోంది. ఈ సినిమాలో శర్వా ఫస్ట్ లుక్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా విడుదలైంది. విజయవంతమైన భారీ చిత్రాల నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇన్ని విశేషాలున్న ఈ సినిమాకు ఇంకా పేరు మాత్రం ప్రకటించలేదు.సినిమా తొలి షెడ్యూలు షూటింగ్ కూడా పూర్తయింది. ఈనెల 15వ తేదీ నుంచి రెండో షెడ్యూలు షూటింగ్ కొనసాగుతోంది. ఈ విషయాలను మరో అగ్ర నిర్మాత మహేష్ కోనేరు తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.ఈ సినిమాతో చింతాడ చంద్రమోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం: రతన్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ.
తాజా వార్తలు
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!







