మురుగదాస్‌ సినిమా లో అక్షయ్‌!

మురుగదాస్‌ సినిమా లో అక్షయ్‌!

'బ్రహ్మోత్సవం' చిత్రసీమకే కాదు మహేష్‌బాబుకీ, ఆయన అభిమానులకూ గట్టి షాక్‌ ఇచ్చింది. అందులోంచి తేరుకోవడానికే హాలీడే ట్రిప్‌ వేశారు మహేష్‌. త్వరలోనే విదేశాల నుంచి తిరిగొస్తారు. వచ్చిన వెంటనే మురుగదాస్‌ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. ఈలోగా.. మురుగదాస్‌ ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం ఓ సెట్‌ని నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్‌ ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్టు టాక్‌. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్‌.జె.సూర్య ప్రతినాయకుడిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈలోగా విలన్‌గా మరో పేరు వినిపిస్తోంది. బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌కుమార్‌ని ప్రతినాయకుడి పాత్ర కోసం సంప్రదిస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతం 'రోబో 2'లో అక్షయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. మరి మహేష్‌ సినిమా ఓకే అంటాడో లేదో చూడాలి. ఒకవేళ అక్షయ్‌ కుమార్‌ ఈ ప్రాజెక్టుపై సంతకం చేస్తే మహేష్‌ సినిమాకి మరింత క్రేజ్‌ రావడం ఖాయం.

 

Back to Top