త్రిషకి పెళ్లంట.! క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ.!
- June 03, 2024
అందాల భామ త్రిషకు వయసు పెరుగుతుందో తరుగుతుందో తెలియడం లేదు. వయసులో వున్నప్పటి కంటే మించిన అందంతో ఇప్పటికీ సిల్వర్ స్ర్కీన్‌ని ఏలుతోందీ ముద్దుగుమ్మ.
ఒకప్సుడు స్టార్ హీరోయిన్ అయిన త్రిష ఆ టైమ్‌లోనే ఓ తమిళ నిర్మాత కమ్ బిజినెస్ మేన్‌తో వివాహం సెట్ చేసుకుంది. అయితే, అనుకోని కారణాలతో ఆ వివాహం రద్దయ్యింది. ఆ తర్వాత త్రిష కెరీర్లో మరీ బిజీ అయిపోయింది.
హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌తో పాటూ, ప్రెస్టీజియస్ సినిమాలతో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇక, ఇప్పుడు స్టార్ హీరోలు, సీనియర్ హీరోలకు బెస్ట్ అండ్ ఫస్ట్ ఆప్షన్‌గా మారింది.
గత కొన్ని రోజులుగా మళ్లీ త్రిష పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయ్. ఈ సారి మలయాళ ప్రొడ్యూసర్‌తో త్రిష పెళ్లి జరగబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. అయితే, ఆ వార్తలను ఎక్కువ కాలం కొనసాగనివ్వలేదు త్రిష.
వెంటనే క్లారిటీ ఇచ్చేసింది. ఆ వార్తల్లో ఎంత మాత్రమూ నిజం లేదని తేల్చేసింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్ పైనే వుందని కుండ బద్దలు కొట్టేసింది. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేస్తున్న త్రిష, తెలుగులో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది.
తాజా వార్తలు
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!