‘స్వాగ్’ కోసం రాణి అవతారమెత్తిన మీరా జాస్మిన్.!

- June 03, 2024 , by Maagulf
‘స్వాగ్’ కోసం రాణి అవతారమెత్తిన మీరా జాస్మిన్.!

విలక్షణ నటుడు శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘స్వాగ్’. ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ని చిత్రంగా రిలీజ్ చేసి, సినిమాపై క్యూరియాసిటీ పెంచిన సంగతీ తెలిసిందే. కొన్ని కార్టూన్ బొమ్మలతో ఓ స్పెషల్ వీడియో చేయించి ఆ వీడియోలోని బొమ్మలకు గంగవ్వ, సునీల్ వంటి పాపులర్ సెలబ్రిటీలతో డబ్బింగ్ చెప్పించారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తోంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందబోతోందని ఫస్ట్ లుక్ గ్లింప్స్‌తో చెప్పకనే చెప్పారు ‘స్వాగ్’ టీమ్.
అలాగే, తాజాగా ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ రివీల్ చేశారు. ఈ సినిమాలో కీలక పాత్రధారిగా నటిస్తున్న మీరా జాస్మిన్ లుక్ రిలీజ్ చేశారు.
ఉత్పలా దేవి‌ అను రాణి పాత్రలో మీరా జాస్మిన్ నటిస్తున్నట్లుగా ఈ పోస్టర్ ద్వారా రివీల్ చేసి, సినిమా కథపై మరింత ఆసక్తి కలిగేలా చేశారు. ఈ సినిమాని టి.జి.విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అసలీ సినిమా కథా, కమామిషు ఏంటనేది తెలియాలంటే మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com