పెరుగుతున్న పసిడి ధర

- June 11, 2016 , by Maagulf
పెరుగుతున్న పసిడి ధర

పసిడి ధర వరసగా నాలుగో రోజూ పెరిగింది. శనివారం రూ.150 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,500కి చేరింది. నగల వ్యాపారుల నుంచి స్థిరంగా కొనుగోళ్లు జరుగుతుండటం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.30శాతం పెరిగి 1,273.30 యూఎస్‌ డాలర్లకు చేరింది. అలాగే వెండి ధర సైతం పెరిగింది. రూ.215 పెరగడంతో కేజీ వెండి ధర రూ.41,065కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 17.28 యూఎస్‌ డాలర్లకు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com