శ్రీలీల అంతవరకా.! మర్చిపోవల్సిందేనేమో.!
- June 11, 2024
శ్రీలీల కెరీర్ టర్న్ చేసిన సినిమా ‘ధమాకా’. మాస్ రాజా రవితేజతో ఈ సినిమాలో శ్రీలీల జత కట్టింది. ఈ సినిమాతోనే శ్రీలీల స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫెయిల్ కావడంతో మళ్లీ ఈ ముద్దుగుమ్మ కెరీర్ డైలమాలో పడింది.
చాలా అవకాశాలు వచ్చినట్లే వచ్చి పోయాయ్ కూడా. ఇప్పుడు ఇంకోసారి రవితేజతో శ్రీలీల జత కట్టబోతోంది. అదే మాస్ రాజా రవితేజ 75 వ సినిమా. భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
కథా కమామిషు వివరాలు ఇంకా తెలియవు కానీ, ఈ సినిమాని లేటెస్ట్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
కాగా, శ్రీలీల చేతిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. విజయ్ దేవరకొండ తదితర హీరోలతో శ్రీలీల సినిమా చేయాల్సి వుండగా, ఆ లిస్టులో మరో కొత్త ముద్దుగుమ్మ భానుశ్రీ బోర్సే పేరు వినిపిస్తోంది.
సో, శ్రీలీల నిలదొక్కుకోవాలంటే ఓ మంచి సినిమా.. హిట్టు సినిమా ఆమె నుంచి రావల్సిందే. ఈ తాజా సినిమా రావడానికి ఇంకో సంవత్సరం ఖచ్చితంగా పడుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి రేస్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మరి అంతవరకూ శ్రీలీల పరిస్థితి ఏంటీ.! ఈ లోపల శ్రీలీల లక్కు చిక్కి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముందుకు కదిలితే.. కానీ, ఆమెని గుర్తు పెట్టుకునే అవకాశం లేదు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







