తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు..
- June 13, 2024
తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి సేవలో తరిస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారి తిరుమలకు విచ్చేశారు చంద్రబాబు. ఉదయం 7.30 నుంచి 8 గంటలమధ్య శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈయనతో పాటు సతీమణి భువనేశ్వరీ, ఏపీ మంత్రి నారాలోకేష్ దంపతులు నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. నిన్న రాత్రి శ్రీవారి సన్నిధిలో బసచేసిన చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు ఈరోజు స్వామి వారిని దర్శించుకోనున్నారు. కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబుకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఘనస్వాగతం పలికారు.
ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి సేవలో తరిస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారి తిరుమలకు విచ్చేశారు చంద్రబాబు. ఉదయం 7.30 నుంచి 8 గంటలమధ్య శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈయనతో పాటు సతీమణి భువనేశ్వరీ, ఏపీ మంత్రి నారాలోకేష్ దంపతులు నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. నిన్న రాత్రి శ్రీవారి సన్నిధిలో బసచేసిన చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు ఈరోజు స్వామి వారిని దర్శించుకోనున్నారు. కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబుకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు రాకతో తిరుపతి, తిరుమలలో సందడి వాతావరణం నెలకొంది. తిరుపతి వీధుల్లో ఎటు చూసినా పసుపు జెండాలే దర్శనం ఇచ్చాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తిరుపతికి రావడంతో కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనకు నీరాజనం పట్టారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







