రుణమాఫీ పై కీలక అప్డేట్ ఇచ్చిన సీఎం రేవంత్
- June 17, 2024
హైదరాబాద్: రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ మేరకు నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరో వైపు మాఫీ అమలుకు విధివిధానాలపై కసరత్తు చేస్తోంది.అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
పాస్ బుక్స్,రేషన్ కార్డు ఉన్న వారికే రుణాలనే మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది.ఎంపీలు, MLAలు, MLCలు, ఆదాయపన్ను చెల్లించేవారు, ఉద్యోగులను మినహాయించనున్నట్లు సమాచారం. కేబినెట్లో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2018 DEC 12 నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. 2-3 రోజుల్లో లబ్ధిదారుల జాబితా ప్రభుత్వానికి చేరనుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం