తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ..

- June 17, 2024 , by Maagulf

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నివాసం వద్ద పోలీసు సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 1.5 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వచ్చేది. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ఇంటి ముందున్న రోడ్డుపై ఆంక్షలు తొలగించింది. దీంతో ఆ రోడ్డు ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు అందుబాటులోకి వచ్చింది.

స్థానిక ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జగన్ నివాసం వద్ద మార్గాల్లో బారికేడ్లు తొలగించింది. రహదారికి రెండు వైపులా పోలీసు చెక్ పోస్టులు ఉంచింది. దీంతో ఆ ప్రాంతాల గుండా ప్రజల రాకపోకలు మొదలయ్యాయి. జగన్ నివాసం వద్ద పోలీస్ సెక్యూరిటీని కూడా ప్రభుత్వం తొలగించడంతో ప్రైవేట్ సెక్కూరిటీతో భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 30మంది కొత్త వారితో జగన్ నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com