గోపీచంద్ ఆక్సిజన్ చివరి షెడ్యూల్..
- June 11, 2016
సినిమా శరవేగంగా చిత్రీకరణను జరపుకుంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్'. ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. జూన్ 12న హీరో గోపీచంద్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
ఈ సందర్భంగా చిత్రయూనిట్ హీరో గోపీచంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ మాట్లాడుతూ మా యాక్షన్ హీరో గోపీచంద్ కు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఆయన హీరోగా మా బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఆక్సిజన్ చిత్రం ఇప్పుడు చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు డిఫరెంట్ సబ్జెక్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా హైలైట్ గా ఉంటుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది. త్వరలోనే ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. సినిమా శరవేగంగా చిత్రీకరణను జరపుకుంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







