బహ్రెయిన్ జనసేన ఆధ్వర్యంలో 100 % strike సెలెబ్రేషన్స్

- June 18, 2024 , by Maagulf
బహ్రెయిన్ జనసేన ఆధ్వర్యంలో 100 % strike సెలెబ్రేషన్స్

మనామా: బహ్రెయిన్ గల్ఫ్ సేన జనసేన కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో జనసేన 100% స్ట్రైక్ సాధించిన సందర్భంగా బహ్రెయిన్ లో నివసిస్తున్న జనసైనికులు వీర మహిళలు జనసేన జయకేతనం అంటూ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి గుర్తుచేసుకొని పద్మ విభూషణ అవార్డుస్తున్న సందర్భంగా అందరూ లేచి నిలబడి మొత్తం స్టార్ స్టార్ మెగాస్టార్ అంటూ కేరింతలతో చప్పట్లు కొట్టారు.

బహ్రెయిన్ జనసేన కన్వీనర్ రాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చారని అమ్మ నాన్న చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.

పలువురు కమిటీ సభ్యులు తన ప్రసంగాలతో అభిమానులను ఆకట్టుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.బహ్రెయిన్ నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి 500 మంది వరకు తెలుగువారు వచ్చి ఆనందంతో ఈ విజయోత్సవ వేడుకలను జరుపుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com