సీఎం రేవంత్ రెడ్డితో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ భేటీ
- June 18, 2024
హైదరాబాద్: తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అగ్ర సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ముందుగా రాగా..తాజాగా మంగళవారం లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ ఫెర్నాండెజ్..సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని సత్కరించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, స్పేస్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో దావోస్‌లో చర్చలు సైతం జరిపింది. అయితే, లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ ఏరోస్పేస్, మిలిటరీ సపోర్ట్, సెక్యూరిటీ, టెక్నాలజీస్ పరిశ్రమలో అతిపెద్ద కంపెనీలలో ఒకటి.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







