ఒమన్‌లో మండుతున్న ఎండలు..!
- June 19, 2024
మస్కట్: అల్ బురైమి గవర్నరేట్‌లోని సునానా స్టేషన్ 47 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. ఒమన్ సుల్తానేట్‌లో గత రెండురోజుల్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ వెల్లడించింది.అల్ బురైమి గవర్నరేట్‌లోని సునయనహ్ స్టేషన్‌లో గత 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత 47.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆ తరువాత అల్ దహిరా గవర్నరేట్‌లోని హమ్రా అద్ దురు స్టేషన్ 46.5 డిగ్రీల సెల్సియస్‌తో ఆపై ధోఫర్ గవర్నరేట్‌లోని మక్షిన్ స్టేషన్ 46.2 డిగ్రీలతో నమోదైంది. సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లోని వాడి అల్ మావిల్ స్టేషన్ మరియు మస్కట్ గవర్నరేట్‌లోని అమెరత్ స్టేషన్‌లో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అల్ బురైమి స్టేషన్‌లో 46.0 డిగ్రీల సెల్సియస్, అల్ దహిరా గవర్నరేట్‌లోని ఇబ్రి స్టేషన్‌లో 45.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు రావొద్దని సూచించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







