నాగ్ అశ్విన్ పై అమితాబ్ ప్రశంసలు..
- June 19, 2024
ముంబై: ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898AD.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ..
సినీ లవర్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా 6 రోజుల్లో రిలీజ్ కాబోతుంది.. ప్రమోషన్స్ లో స్పీడును పెంచింది టీమ్.. ఒక్కోరోజు ఒక్కో అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను మరింత ఊరిస్తున్నారు..తాజాగా ముంబై లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు..
ప్రస్తుతం ఆ ఈవెంట్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.. ఈ ఈవెంట్ కు సినిమాలోని ప్రముఖులు హాజరై సందడి చేశారు.. ఈ క్రమంలో ఈ ఈవెంట్ లో బిగ్ బి అమితాబ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.. బిగ్ బి మాట్లాడుతూ.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపించారు.. విజువల్స్ వండర్ ను క్రియేట్ చేశారు.. సినిమా ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ అంటూ అతని పై ప్రశంసలు కురిపించారు.. ఈ క్రమంలో విజువల్స్ అంటూ స్టోరీని లీక్ చేసాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు..
ప్రస్తుతం అమితాబ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక మొన్న రిలీజ్ చేసిన సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అలాగే అమెరికాలో మరో రికార్డును బద్దలు కొట్టింది.. ఉత్తర అమెరికాలో $2 మిలియన్ ప్రీ సేల్స్ వసూలు చేసిన భారతీయ చిత్రంగా కల్కి నిలవడం విశేషం.. ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా రిలీజ్ కు ముందే అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.. ఈ నెల 27 న సినిమా విడుదల కాబోతుంది..
తాజా వార్తలు
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ









