రుషికొండ ప్యాలెస్ ప్రజల సొమ్ముతో నిర్మించారు: షర్మిల
- June 20, 2024
అమరావతి: రుషికొండ భవన రహస్యం వీడడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వైడ్ గా ఈ భవనం గురించి మాట్లాడుకుంటున్నారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా, రూ.500 కోట్ల భారీ వ్యయంతో అత్యంత రహస్యంగా ఈ ప్యాలెస్ నిర్మించారని , 61 ఎకరాల్లో ఈ భవన సముదాయాలు నిర్మించారని, అందులో రాజసౌధాన్ని తలపించేలా ఉన్న భవనం కోసమే రూ.500 కోట్లు ఖర్చు చేశారని , రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఉందని టీడీపీ బయటపెట్టింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది.
తాజాగా ఈ ఇష్యూ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించారు. రుషికొండ ప్యాలెస్ కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఉంటే అది క్షమించరాని నేరమన్నారు. రుషికొండ ప్యాలెస్‌ను ఎందుకోసం నిర్మించారో ప్రజలకు తెలియాలన్నారు. అలాగే రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలన్నారు. తప్పని రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసిందని.. విచ్చలవిడిగా ఖర్చు చేసిందని షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







