అంతర్జాతీయ యోగా దినోత్సవం..!

- June 21, 2024 , by Maagulf
అంతర్జాతీయ యోగా దినోత్సవం..!

యోగా ప్రాముఖ్యత, దాని ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న జరుపుకుంటారు.ప్రపంచ స్థాయిలో యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడం, దీనిని జీవనశైలిలో భాగం చేసుకునేలా ప్రజలను ప్రేరేపించడం దీని ప్రధాన లక్ష్యం. యోగా దినోత్సవం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి అపోహలను తొలగిస్తారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడంతో పాటు, మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు.

2015 జూన్ 21న యోగా దినోత్సవాన్ని మొదటిసారిగా జరుపుకున్నారు. ఈ రోజున లక్షలాది మంది సామూహికంగా యోగా చేశారు. భారతదేశంలో ఈ ప్రధాన కార్యక్రమం ఢిల్లీ(delhi)లోని రాజ్‌పథ్‌లో నిర్వహించబడగా, ఇందులో సుమారు 35,000 మంది పాల్గొన్నారు. మనస్సు, శరీరం మధ్య ఐక్యతను స్థాపించే ప్రాచీన భారతీయ అభ్యాసం యోగా ప్రపంచ వేదికపై అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఇది జరుపుకోవడం పదవ సంవత్సరం కావడం విశేషం.

యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని, మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి, వారిని నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందనీ యోగా గురువులు చెబుతున్నారు.ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతిగా యోగాను ప్రతీ ఒక్కరూ సాధన చెయ్యాలని ఆయన పేర్కొన్నారు. క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చునని చెప్పారు.

ప్రతి సంవత్సరం యోగా దినోత్సవాన్ని ఒక ప్రత్యేక థీమ్‌(yoga theme)తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ దేశంలోని మహిళలకు అంకితం చేయబడింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 థీమ్ “మహిళా సాధికారత కోసం యోగా”. ఈ థీమ్ మహిళలు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ప్రేరేపించడమే లక్ష్యం. 

న్యూ ఢిల్లీ లోని యోగా గురు వరుణ్ ఆచార్య కి సంబందించిన ఫోటోలు...

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com